HomeTop StoriesElections: నేడు అసెంబ్లీ సమరం.. కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో సర్వం సిద్ధం చేసిన ఈసీ!

Elections: నేడు అసెంబ్లీ సమరం.. కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో సర్వం సిద్ధం చేసిన ఈసీ!

Assembly elections : దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ రేపుతున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.

- Advertisement -

6 కోట్ల మంది ఓటర్లు: ఈ మూడు ప్రాంతాల్లో కలిపి మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సుమారు 6 కోట్లకు పైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలతో పాటు మే 4, 2026న వెలువడనున్నాయి.

పోలింగ్ కేంద్రాల వివరాలు: ఎన్నికల సంఘం ఓటర్ల సౌకర్యార్థం భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అస్సాం 126 స్థానాలకు గానూ అత్యధికంగా 31,486 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేరళాలో 140 స్థానాలకు గానూ 30,471 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పుదుచ్చేరిలో 30 స్థానాలకు 1,009 కేంద్రాలను ఈసీ సిద్ధం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News