HomeTop StoriesMonkey: అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావే.. అలా అనకే కోతిపిల్ల.. నాకు అసలే సిగ్గు!

Monkey: అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావే.. అలా అనకే కోతిపిల్ల.. నాకు అసలే సిగ్గు!

Monkey Love: ప్రకృతి చాలా అందమైనది. రంగురంగుల పూల సోయగాలతో నిత్యం కనువిందు చేస్తుంటుంది. అంతేకాదు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ ప్రకృతిలో చిత్ర విచిత్రమైన పుష్పాలతో పాటుగా ఎన్నో జంతువులు ఉంటాయి. అందులో మనందరికి సుపరిచితం కోతి. ఎందుకంటే ఆ కోతి జాతి మన పూర్వికులే కాబట్టి. అందుకే కోతి చేష్టలు ఒకింత మనలానే ఉంటాయి. అప్పుడప్పుడు మనలాగే తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతుంటాయి. ఒక్కోసారి తలలో పేలు సైతం చూసుకుంటాయి. అయితే సరిగ్గా అలానే ఓ పిల్ల కోతి.. తన తల్లి ముఖాన్ని మురిపెంగా చూస్తూ ఉంది.

- Advertisement -

ప్రకృతి అద్భుతాల్లో ప్రేమ ఒకటి : ప్రకృతి ఎంతో వింతైనది. అందులో కోతి జాతీ ఇంకా వింతైనది. అయితే ఈ కోతికి సంబంధించిన ఓ సన్నివేశం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఓ చెట్టుపై తల్లి కోతి దీనంగా కూర్చుంది. అయితే అక్కడే ఉన్న కోతి పిల్ల తన తల్లిని గమనించింది. ఎందుకో నా తల్లి దీనంగా ఉందని అనుకుంది. తన తల్లికి బయట ఆహారం దొరుకపోవడంతో అలా ఉన్నట్లు కోతి పిల్ల చేష్టలు ఉన్నాయి. తల్లిని హ్యాపీ చేయాలనుకుని తల్లి వద్దకు వచ్చింది.

Also read:https://teluguprabha.net/top-stories/today-telangana-vision-document-2047-launched-in-global-summit/

అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావే: దిగాలుగా ఉన్న తల్లిని గమనించిన కోతి పిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి తల్లి ఒడిలో కూర్చుంది. తల్లిని హ్యాపీ చేయడం కోసం అన్నట్లుగా .. తల్లి ముఖాన్ని చూస్తూ ఏదో ఏదో అరుస్తుంది. అప్పుడు ఆ తల్లి తెగ సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వింది. అయితే ఆ రెండు కోతుల మధ్య జరిగిన సంభాషణ మనకు అర్థం కాకున్నా ప్రకృతి ప్రేమికులు మాత్రం.. అక్కడ తల్లీ బిడ్డల మధ్య ఆప్యాయత ఉందని గమనించారు. మనుషులకే కాదు జంతువులకు ప్రేమలు ఉంటాయని అన్నారు. ఆ కోతుల మధ్య గల ఆప్యాతను గమనించిన స్థానిక ప్రజలు ఆశ్చర్యంగా వాటిని చూశారు. తల్లిపై పిల్ల కోతి చూపించిన ప్రేమకు ఫిదా అయి తమ ఫోన్‌లలో ఫోటోలు తోసుకున్నారు. ఈ దృశ్యం సోమవారం తెలుగుప్రభ కెమెరాకు చిక్కింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News