HomeTop StoriesDharamshala: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. ధర్మశాలలో కురుస్తున్న భారీ వర్షం!

Dharamshala: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. ధర్మశాలలో కురుస్తున్న భారీ వర్షం!

Dharamshala: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌. ధర్మశాలలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుంది. దీంతో క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది. చాలా కాలం తర్వాత టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్లూ జెర్సీలో కనిపించనున్నాడు. అయితే హిట్‌మ్యాన్‌ ఆట చూద్దామనుకునే అభిమానుల ఆశలపై వర్షం నీళ్లు చల్లేలా ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండడంతో మ్యాచ్‌కి తీవ్ర అంతరాయం కలిగింది.

- Advertisement -

పేస్ అనుకూలంగా పిచ్‌: వర్షం తగ్గి మ్యాచ్‌ ప్రారంభం అయితే.. టాస్‌ కీలకంగా మారనుంది. వర్షం కారణంగా ధర్మశాల పిచ్‌ పేస్‌కు అనుకూలించనుంది. ఇక్కడ కొత్త బంతితో స్వింగ్‌ లభిస్తుంది. కాబట్టి పవర్‌ప్లేలో బ్యాటర్లకు పరీక్ష తప్పదు. అయితే క్రీజులో కుదురుకుంటే భారీగా పరుగులు సాధించవచ్చు. టాస్ గెలిచిన జట్టు ఇక్కడ చేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ గ్రౌండ్‌లో ఇప్పటివరకు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 5 సార్లు, మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 4 సార్లు విజయం సాధించాయి.

ఇరు జట్ల అంచనా:

  • భారత్: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ప్రిన్స్‌/గుర్నూర్‌ బ్రార్‌.
  • అఫ్గానిస్థాన్‌: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్, సెదికుల్లా అటల్, రహ్మత్‌ షా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, అలీఖిల్, రషీద్ ఖాన్, మహ్మద్‌ సలీమ్, జియావుర్‌ రెహ్మాన్, ఏఎం ఘజన్‌ఫర్‌.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News