HomeTop StoriesBalapur : పూరీ మందిర నమూనాలో వినాయకుడు.. సరికొత్త రికార్డు దిశగా ప్రసాదం

Balapur : పూరీ మందిర నమూనాలో వినాయకుడు.. సరికొత్త రికార్డు దిశగా ప్రసాదం

Balapur Ganesh laddu auction : భాగ్యనగర గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ బొజ్జగణపయ్య లడ్డూ ప్రసాదం దక్కించుకోవడమంటే భక్తులకు కొండంత సెంటిమెంట్.  ఈ ఏడాది బాలాపూర్ వినాయక మండపాన్ని ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి ఆలయ నమూనాలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆధ్యాత్మిక ప్రాంగణంలో 18 అడుగుల భారీ వినాయకుడు భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తున్నాడు. గతంలో తిరుపతి, అరుణాచలం, అయోధ్య రామాలయం, స్వర్ణగిరి నమూనాలను ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ.. ఈసారి జగన్నాథుని ఆలయ సెట్టింగ్‌ను అత్యంత నైపుణ్యంతో రూపొందించినట్లు కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు.

- Advertisement -

స్వామివారి చేతిలో కొలువుదీరిన 21 కిలోల పవిత్ర లడ్డూ మహోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఉమామహేశ్వరరావు కుటుంబం ఎంతో నిష్ఠతో ఈ లడ్డూను తయారు చేసి స్వామివారికి కానుకగా సమర్పించింది. 1994లో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం ముగిసిన అనంతరమే భాగ్యనగర నిమజ్జన శోభాయాత్ర ఆరంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది రూ.35 లక్షలు పలికిన ఈ లడ్డూ, ఈసారి ఏకంగా రూ.40 లక్షల మైలురాయిని దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 25 వరకు కొనసాగే ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, రాత్రివేళ విశేష హారతులు, భజనలతో బాలాపూర్ భక్తిపారవశ్యంలో మునిగితేలుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News