Anticipatory bail Petition: పోక్సో (POCSO) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో.. వెకేషన్ కోర్టు ఈ పిటిషన్‌ను విచారించనుంది.
ఉత్కంఠ రేపుతున్న పోక్సో కేసు: భగీరథ్ తరపు న్యాయవాది నవీన్ కుమార్ ఈనెల 12న (మంగళవారం) హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. నేటి విచారణా జాబితాలో ఈ పిటిషన్ 28వ కేసుగా నమోదైంది. మధ్యాహ్నం సమయానికి ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేసు నమోదైనప్పటి నుండి భగీరథ్ పరారీలో ఉండటం, పోలీసుల విచారణకు సహకరించకుండా డుమ్మా కొట్టడం వంటి అంశాలు బెయిల్ విచారణలో కీలకం కానున్నాయి.
Also read-Kalvakuntla Kavitha: బండి భగీరథ్ కేసు.. బీఆర్ఎస్ తీరుపై కవిత తీవ్ర ఆగ్రహం!
న్యాయ నిపుణుల అభిప్రాయం: సాధారణంగా పోక్సో వంటి తీవ్రమైన కేసుల్లో ముందస్తు బెయిల్ లభించడం చాలా కష్టమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిందితుడు విచారణకు గైర్హాజరై.. పరారీలో ఉన్నారనే అంశాన్ని పోలీసులు కోర్టు దృష్టికి బలంగా తీసుకెళ్తే బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఒకవేళ నేడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే.. భగీరథ్‌కు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో, నేటి కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

