Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా రంగంలోకి దిగి విచారణను సమీక్షిస్తున్నారు. ఈ కేసులో నేడు జరగనున్న విచారణ అత్యంత కీలకంగా మారనుంది.
డీసీపీ క్షేత్రస్థాయి పరిశీలన: సోమవారం మధ్యాహ్నం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న డీసీపీ రితిరాజ్.. కేసు పూర్వాపరాలను పరిశీలించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలతో పాటు ఇప్పటివరకు సేకరించిన ప్రాథమిక ఆధారాల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. 17 ఏళ్ల మైనర్ బాలికను భగీరథ్ లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
Also read-Bandi Bhagirath: ‘బండి భగీరథ్‌పై పోక్సో కేసుతో బీజేపీకి సంబంధం లేదు’- రాంచందర్ రావు
నేడు మరోసారి బాధితురాలి వాంగ్మూలం నమోదు: ఈ కేసులో నేడు జరగనున్న విచారణ అత్యంత కీలకంగా మారనుంది. డీసీపీ ఆదేశాల మేరకు బాధితురాలైన బాలికను భరోసా కేంద్రానికి పిలిపించి.. ఆమె సమక్షంలోనే మరోమారు స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. బాలిక ఇచ్చే తాజా వాంగ్మూలం ఆధారంగా కేసులోని సెక్షన్లను సవరించడం లేదా అదనపు సెక్షన్లను చేర్చే అవకాశం ఉంది. గతంలో నమోదు చేసిన వాంగ్మూలంతో దీనిని సరిపోల్చి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

