Thursday, March 12, 2026
HomeTop StoriesBangladesh: ఫలితాలు విడుదల.. బీఎన్‌పీ ఘన విజయం!

Bangladesh: ఫలితాలు విడుదల.. బీఎన్‌పీ ఘన విజయం!

Bangladesh Nationalist Party: బంగ్లాదేశ్‌లో సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ప్రభంజనం సృష్టించింది. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ కూటమి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించింది. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ ఏకంగా 209 సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని ఖరారు చేసుకుంది.

- Advertisement -

జమాతే ఇస్లామీకి నిరాశే: ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా నిలుస్తుందని భావించిన జమాతే ఇస్లామీ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ప్రజలు బిఎన్‌పి వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ ప్రభావం నామమాత్రంగానే మిగిలిపోయింది. షేక్ హసీనా పాలన తర్వాత వచ్చిన రాజకీయ మార్పుల్లో తారిఖ్ రెహ్మాన్ నాయకత్వానికే ప్రజలు పట్టం కట్టారు.

తారిఖ్ రెహ్మాన్ కొత్త ప్రధాని: ఈ భారీ విజయంతో తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. కొద్ది గంటల్లోనే ఎన్నికల కమిషన్ అధికారికంగా ఫలితాలను వెల్లడించనుంది. దీంతో బిఎన్‌పి శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News