HomeTop StoriesBank: కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌..సమ్మె వాయిదా..పనిచేయనున్న బ్యాంకులు

Bank: కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌..సమ్మె వాయిదా..పనిచేయనున్న బ్యాంకులు

Strike Postponed: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టాలని నిర్ణయించిన మూడు రోజుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చల్లో పలు అంశాలపై సానుకూల పురోగతి కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణంగానే పనిచేయనున్నాయి. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవల్లో సమ్మె కారణంగా ఏర్పడే అంతరాయం ఉండదని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అన్ని శనివారాలను సెలవు దినాలుగా మార్చే అంశంపై మరింత చర్చ జరగనుంది. ఇందుకోసం ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులు, బ్యాంకు యాజమాన్యాలు సహా అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఈ కమిటీ ప్రయత్నించనుంది.

అలాగే స్కేల్ 4, అంతకంటే పై స్థాయి అధికారులకు వర్తించే పీఎల్‌ఐ పథకంలో మార్పులపై యూనియన్లు చేసిన సూచనలను పరిశీలించనున్నారు. అవసరమైన సవరణలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఐబీఏతో చర్చలకు మార్గం ఏర్పడింది.

2024 మార్చి 8నాటి మినిట్స్‌లో నమోదైన పెండింగ్ అంశాల పరిష్కారంపైనా ఐబీఏ, యూఎఫ్‌బీయూ మధ్య తదుపరి చర్చలు కొనసాగనున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో గతంలో ప్రకటించిన సమ్మెలు, ఇతర ఆందోళన కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ నేతలు సంయుక్తంగా వెల్లడించారు. దీంతో ప్రస్తుతం బ్యాంకుల సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Also Read:Bigg Boss Telugu 10: నీకు ఏమైనా పిచ్చా..అంటూ ముఖేష్‌ పై ఫైర్‌ అయిన వర్షిణి పాప

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News