HomeTop StoriesBank Holidays:నాలుగు రోజులు బ్యాంకులు బంద్

Bank Holidays:నాలుగు రోజులు బ్యాంకులు బంద్

Bank Holidays List: వచ్చే వారం బ్యాంకు పనులు పెట్టుకుంటున్న కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌. రానున్న వారంలో బ్యాంకులు ఏకంగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఎందుకంటే వచ్చే వారంలో రక్షాబంధన్,మిలాద్‌ ఉన్‌ నబీ లాంటి పండుగలు ఉండడంతో బ్యాంకులు క్లోజ్‌ కానున్నాయి.

- Advertisement -

అత్యవసర బ్యాంకు పనులు ఏమైనా ఉన్నట్లయితే సోమవారం నాడే వాటిని పూర్తి చేసుకుంటే బెటర్‌. వచ్చే వారం ఒకటి లేదా రెండు కాకుండా…నాలుగు బ్యాంకు సెలవులు ఉన్నట్లు సమాచారం.ఆగస్టు 25న మిలాద్-ఉన్-నబీ,ఆంధ్రప్రదేశ్, కేరళలోని బ్యాంకులకు సెలవులు.ఆగస్ట్ 26న బరావాఫా, ఈద్-ఇ-మిలాద్ లేదా ముహమ్మద్ ప్రవక్త తిరువో, మిలాద్-ఉన్-నబీ పండుగల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, మణిపూర్, జమ్మూ మరియు కాశ్మీర్, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి.

ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్, గుజరాత్, సిక్కిం, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, రాజస్థాన్, కేరళ, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు.

ఆగస్టు 30న ఆదివారం సందర్భంగా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు. దీంతో వచ్చే వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసే ఉంటాయి.

Also Read: KTR: ప్రజలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్‌

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News