Asian Games: ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌కు సంబంధించి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ ప్రకటించిన ప్రాబబుల్స్ జాబితాలో 30 మందికి చోటు కల్పించారు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌లకు చోటు దక్కలేదు. అయితే ఇటీవల దేశీవాళీ క్రికెట్‌లో సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ లిస్టులో స్థానం లభించడం విశేషం.
యువ ఆటగాళ్లకు చోటు: సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి. అయితే అదే సమయంలో భారత్ జట్టు.. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టీ-20 సిరీస్‌లు ఆడనుంది. ఇందులో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. అందుకే ఆసియా గేమ్స్‌కు వెళ్లే జట్టులో యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలని.. బీసీసీఐ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ జాబితాలో గిల్‌కు చోటు కల్పించలేదు. ఇక ఈ జాబితాలో పేసర్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ.. తుది జట్టులో అతడిని ఎంపిక చేస్తారా? లేదా? అనేది 15 మందిని ప్రకటించే ముందు నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.
Also read-Amitabh praises Vaibhav: నీ వయసులో మేం గల్లీ క్రికెట్ కూడా ఆడలేదు.. వైభవ్‌ను ఆకాశానికెత్తిన అమితాబ్
బీసీసీఐ ప్రకటించిన 30మంది ఆటగాళ్ల జాబితా: వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దుబె, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, నితీశ్ కుమార్ రెడ్డి, రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్,వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, ఆయుష్ బదోనీ, హర్ష్ దుబె, ధ్రువ్ జురెల్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.

