HomeTop StoriesBCCI: చీఫ్ సెలక్టర్‌ రేసులో వీవీఎస్‌ లక్ష్మణ్‌?

BCCI: చీఫ్ సెలక్టర్‌ రేసులో వీవీఎస్‌ లక్ష్మణ్‌?

VVS Laxman: భారత్ వరుసగా రెండు సిరీస్‌లు ఓడిపోవడంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై వేటు పడుతుందనే ప్రచారం జోరందుకుంది. ఆయన స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు ఇస్తారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. లక్ష్మణ్‌ను కోచ్‌గా కాకుండా చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తారనే చర్చ జరుగుతోంది.

- Advertisement -

అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపు: ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. ఇప్పటికే పొడిగింపుపై కొనసాగుతున్న ఆయనకు మరో అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ కొన్ని కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అగార్కర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను రేసులోకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు వన్డే వరల్డ్ కప్ వరకు అగార్కర్ – గంభీర్ జోడీనే కొనసాగించాలనే ఆలోచనలోనూ బోర్డు పెద్దలు ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Also Read-Aaqib Nabi: టెస్టు జట్టులో జమ్మూకశ్మీర్‌ పేసర్.. బుమ్రా స్థానంలో అవకాశం!

సెప్టెంబర్ నెలలో రానున్న స్పష్టత: ప్రధాన కోచ్, చీఫ్ సెలక్టర్ పదవులతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవితవ్యంపైనా వచ్చే నెలలో పూర్తి స్పష్టత రానుంది. ప్రస్తుతం టీమిండియా శ్రీలాంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో సిరీస్‌లు, బంగ్లాదేశ్‌ పర్యటన కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి. భారత జట్టు బిజీ షెడ్యూల్‌లో ఉండటంతో ప్రస్తుతానికి ఎలాంటి తక్షణ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. వచ్చే నెలలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ముగ్గురి భవితవ్యంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News