Saturday, November 15, 2025
HomeTop StoriesBest smartphones: కేవలం రూ.10 వేలలోపే బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా?.. అయితే, వీటిపై ఓలుక్కేయండి

Best smartphones: కేవలం రూ.10 వేలలోపే బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా?.. అయితే, వీటిపై ఓలుక్కేయండి

Best smartphones Under 10k Price: ఓవైపు దసరా, దీపావళి పండుగ ఆఫర్లు, మరోవైపు జీఎస్టీ తగ్గింపుతో భారత మార్కెట్‌లో ప్రస్తుతం డిస్కౌంట్ మేళా నడుస్తోంది. జీఎస్టీ తగ్గింపు అలాగే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు ఆఫర్లు ఇస్తున్న నేపథ్యంలో జనాలు ఎగబడుతున్నారు. తక్కువ ధరకే వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై అధిరిపోయే ఆఫర్లు ప్రకటించడంతో వీటి కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. మీరు కూడా ఈ పండక్కి రూ.10 వేలలోపు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నట్లైతే.. ఈ టాప్‌ 5 స్మార్ట్ ఫోన్లపై ఓలుక్కేయండి.

- Advertisement -

లావా బ్లెజ్‌2 5G

5G కనెక్టివిటీకలిగిన లావా బ్లేజ్ 2 5G అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో రూ.8,899 కే అందుబాటులో ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 6.56-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే కలిగి ఉంది. కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్, అలాగే ముందు భాగంలో 8MP లెన్స్ తో డ్యూయల్ కెమెరా అందుబాటులో ఉంది. 5,000mAh బ్యాటరీ విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు ఈ మోడల్ ఫోన్ లో రెండు రకాల స్టోరేజ్ టైప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి 4GB RAM విత్ 64GB స్టోరేజ్, రెండవది 6GB RAM విత్ 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తాయి.

పోకో ఎం7 5G
అద్భుతమైన ఫీచర్స్ కలిగిన పోకో M7 5G అమెజాన్ లో కేవలం రూ. 8,499కి లభిస్తుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. రిఫ్రెష్ రేట్‌ 120Hz , డిస్ ప్లే సైజ్ 6.8, 6GB RAM, 128 GB స్టోరేజ్, 50MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. కేవలం 10వేల లోపే ఇంత మంచి డీల్ అందుబాటులో ఉంది.

మోటరోలా G05

గతేడాది లాంచ్ అయిన మోటరోలా G05 మోడల్ ప్రీమియం డిజైన్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం 6,999 కే అందుబాటులో ఉంది. 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 4GB RAM, 64GB స్టోరేజ్‌, 50MP బ్యాక్ కెమెరా, 5,200mAh, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కలిగి ఉంది.

రెడ్‌మి A4

రెడ్‌మి A4 ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ. 8, 293కే అందుబాటులో ఉంది. దీని ఫీచర్స్ కూడా బెస్ట్ గా ఉన్నాయి. రెడ్‌మి A4 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌, 6.8-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో 4GB RAM, 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ ఇందులో ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ సైజ్ 5160mAh , బ్యాక్ కెమెరా విత్ కెమెరా 50MP, ఫ్రంట్ విత్ 5MP తో లభిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad