HomeTop StoriesIBOMMA: చిత్ర పరిశ్రమకు బిగ్‌ షాక్‌.. ఐ బొమ్మ మళ్లీ వచ్చింది!

IBOMMA: చిత్ర పరిశ్రమకు బిగ్‌ షాక్‌.. ఐ బొమ్మ మళ్లీ వచ్చింది!

IBOMMA is Back: పైరసీ భూతం సినీ పరిశ్రమను వెంటాడుతూనే ఉంది. గతంలో పోలీసులు పకడ్బందీగా మూసివేయించిన వివాదాస్పద పైరసీ సైట్ ఐ బొమ్మ (iBomma).. ఇప్పుడు ఐ బొమ్మ-2.0 పేరుతో ప్రత్యక్షమైంది. మునుపటి కంటే మెరుగైన హెచ్‌డీ క్వాలిటీతో సినిమాలు అప్‌లోడ్ చేస్తుండటంతో అటు పోలీసులు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలు విస్తుపోతున్నాయి.

- Advertisement -

సజ్జనార్‌కు సవాల్‌గా మారిన ఐ బొమ్మ-2.0: కొత్తగా ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌లో ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రాన్ని మొదటి సినిమాగా స్ట్రీమింగ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కంటే అత్యున్నత నాణ్యతతో కూడిన వీడియో కంటెంట్‌ను అందిస్తూ.. ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఈ పైరసీ ముఠా. అయితే పైరసీపై ఉక్కుపాదం మోపే క్రమంలో ఐపీఎస్ అధికారి సీపీ వీసీ సజ్జనార్ గతంలో ఐ బొమ్మ నెట్‌వర్క్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన పర్యవేక్షణలో 2025 నవంబర్ 15న ఈ వెబ్‌సైట్‌ను పోలీసులు పూర్తిగా బ్లాక్ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ 2.0 వెర్షన్‌ను తీసుకురావడం పోలీసులకే సవాల్ విసిరినట్లయింది.

రవి పాత్రపై అనుమానాలు: గతంలో ఐ బొమ్మ నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మంది రవిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. తాజా పరిణామాల వెనుక మళ్లీ రవి హస్తమే ఉందా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను ఎక్కడి నుండి నిర్వహిస్తున్నారు? సర్వర్లు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మితమయ్యే సినిమాలను ఇలా ఉచితంగా పైరసీ సైట్లలో పెట్టడం వల్ల పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుతుందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ వెర్షన్ 2.0పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News