HomeTop StoriesBigg Boss: బిగ్‌ బాస్‌ హిస్టరీలోనే తొలిసారి..15 లక్షలతో మిథిలేష్‌ బయటకు

Bigg Boss: బిగ్‌ బాస్‌ హిస్టరీలోనే తొలిసారి..15 లక్షలతో మిథిలేష్‌ బయటకు

Bigg Boss Telugu: బిగ్ బాస్ పదో సీజన్ శనివారం ఎపిసోడ్ లో మిథిలేష్ నిర్ణయం హైలైట్ గా నిలిచింది. టెంప్టేషన్ వీక్ లో భాగంగా నాగార్జున ఇంట్లోకి బ్రీఫ్ కేసు పంపించారు. మొదట అందులో ఐదు లక్షలు ఉన్నాయని చెప్పినా ఎవరూ ముందుకు రాలేదు. మొత్తాన్ని పది లక్షలకు, ఆ తర్వాత పదిహేను లక్షలకు పెంచడంతో మిథిలేష్ ఆ డీల్ ను అంగీకరించాడు. ఈ మొత్తం తీసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అతను సిద్ధమయ్యాడు. ఈ నిర్ణయం విన్నర్ ప్రైజ్ మనీలో తగ్గుతుందని నాగార్జున స్పష్టం చేశారు. ఇతర కంటెస్టెంట్లు అతన్ని ఆపేందుకు ప్రయత్నించినా మిథిలేష్ తన నిర్ణయం మార్చుకోలేదు. చివరకు మెజార్టీ సభ్యులు కూడా అతని నిర్ణయాన్ని అంగీకరించారు. ఆదివారం ఎపిసోడ్ లో మిథిలేష్ స్టేజ్ పైకి వస్తాడని నాగార్జున ప్రకటించారు.

- Advertisement -

శనివారం ఎపిసోడ్ లో శ్రిష్టి, సుధీర్ మధ్య జరిగిన వివాదంపై నాగార్జున మాట్లాడారు. సుధీర్ మాటలు తన గతాన్ని గుర్తు చేయడంతో భావోద్వేగానికి గురై అలా మాట్లాడానని శ్రిష్టి చెప్పింది. గతాన్ని పక్కన పెట్టి ముందుకు సాగాలని నాగార్జున సూచించారు. సుధీర్ కూడా ఎదుటివారి భావాలను అర్థం చేసుకుని మాట్లాడాలని చెప్పారు.

నరేష్ విషయంలో త్రిగుణ్ నిర్ణయాన్ని వివరించిన నాగార్జున, నరేష్ ను ప్రశంసించారు. దేబ్జానీ తన మాటలపై క్షమాపణ చెప్పింది. ముఖేష్, రోహిత్, చరణ్, వంశీ, ఝాన్సీ, షాలినీ, త్రిగుణ్ ఆటతీరుపైనా నాగార్జున సూచనలు చేశారు. వర్షిణి, అమన్ టాస్క్ పై కూడా వివరణ ఇచ్చారు. షాలినీ సేఫ్ అయిన తర్వాత తల్లిదండ్రుల ఫోటోలు రావడంతో ఆమె భావోద్వేగానికి గురైంది.

అనంతరం సిగ్మా ప్రమోషన్స్ లో భాగంగా సంజయ్, సందీప్ కిషన్ ఇంటికి వచ్చారు. ఎపిసోడ్ ప్రారంభంలో శుక్రవారం జరిగిన సంఘటనలను చూపించారు. ముఖేష్ ఓవర్ యాక్షన్, మిథిలేష్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. అపూర్వ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి.

Also Read:Paradise:చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చా: కేటీఆర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News