Brain Stacking: బుర్రకు బ్రేక్ ఇవ్వమని సైకాలజిస్టులు ఈమధ్య విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మనందరి బుర్రలు విపరీతంగా అలసిపోవటమే దీనికంతా కారణం. వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితంతో పాటు డిజిటల్ మీడియా ప్రభావంతో మన బుర్రలు విపరీతంగా అలసటకు గురవుతున్నాయి. చివరికి రాత్రి పడుకునే ముందు కూడా స్క్రోలింగ్ చేస్తూ రీల్స్ చూడటం లేదా ఓటీటీ కంటెంట్ చూడటాన్ని బెడ్ టైం రొటీన్ గా పెట్టుకునే వారు మనలో ఎక్కువమంది. దీంతో పడుకునేందుకు కూడా బెడ్ టైం సరిపోవట్లేదు. అందుకే బుర్రకు బ్రేక్ ఇవ్వమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అసలు బర్రకు బ్రేక్ ఇచ్చేదెలా అంటే..చాలా సింపుల్. ఏ పనీ చేయకుండా ప్రశాంతంగా అలా కూర్చోండి. అలా కూర్చోలేం బోర్ కొడుతుందంటే జస్ట్ అలా నడవండి. వీలైతే ఓపన్ ప్లేస్ లో లేదంటే ఇంట్లోనే నడవండి.

బ్రెయిన్ స్టాకింగ్ ట్రెండ్
ఖాళీగా ఉన్నప్పుడు బోర్ కొట్టినప్పుడు చేతిలోకి ఫోన్ తీసుకుంటాం. అలా తీసుకోకుండా డిజిటల్ స్క్రీన్ తో ఏమాత్రం సంబంధం లేని పుస్తకాలను తీసుకుంటే చాలు. ఏదైనా పజిల్ అంటే పదకేళి, సూడోకో లేదా క్విజ్ ట్రై చేయటం. డైరీలాంటి ఏదో మీకు నచ్చిన బుక్ లో జర్నలింగ్ చేయమంటున్నారు. రాయటం మర్చిపోతున్న మన తరానికి ఏదో ఒకటి అలా రాస్తుంటే వచ్చే రిలీఫ్ ఇంకోలా ఉంటుంది. మీ మనసులో మెదులుతున్న సమస్యలు, కష్టాలు ఏవైనా కావచ్చు వాటిని రాతపూర్వకంగా చేస్తే బిగ్ రిలీఫ్ దక్కుతుంది. ఇంకా డ్రాయింగ్, కలరింగ్, స్కెచ్చింగ్..ఇలా ఏదో ఒక వ్యసనాన్ని ఇష్టంగా చేసుకుంటూపోతే బెయిన్ కు బ్రేక్ దొరికినట్టే.

మెదడుకు వ్యాయామం
పజిల్స్ వంటివి పూర్తి చేయటంతో ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ప్రశాంతంగా మనసు కుదుటపడుతుంది. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ తో బుర్ర మొద్దుబారి, బ్రెయిన్ రాట్ కు దారి తీయకుండా ఉండేలా ఈ అనలాగ్ అలవాట్లు మళ్లీ మొదలు పెట్టడమే బ్రెయిన్ స్టాకింగ్ ట్రెండ్ అంటే. ప్రస్తుతం ఇది ఓ వెల్నెస్ ట్రెండ్ గా వైరల్ అవుతోంది. డూమ్ స్క్రోలింగ్ వంటివాటికి ఈ స్టాకింగ్ ఓ విరుగుడు.

