HomeTop StoriesFootball: బ్రెజిల్‌కు ఊహించని పరాజయం.. రిటైర్మెంట్ ప్రకటించిన నెయ్‌మార్

Football: బ్రెజిల్‌కు ఊహించని పరాజయం.. రిటైర్మెంట్ ప్రకటించిన నెయ్‌మార్

Neymar: ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఒక సుదీర్ఘమైన అధ్యాయం ముగిసింది. బ్రెజిల్ స్టార్ స్ట్రైకర్, రికార్డుల వీరుడు నెయ్‌మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో నార్వే చేతిలో బ్రెజిల్ జట్టు 2-1 తేడాతో ఊహించని రీతిలో పరాజయం పాలై.. టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన వెంటనే ఆయన ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

- Advertisement -

మైదానంలోనే కన్నీటి పర్యంతమైన నెయ్‌మార్‌: న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత నాకౌట్ మ్యాచ్‌లో నెయ్‌మార్ ఆరంభం నుండి కాకుండా 67వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి ప్రవేశించారు. మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌లో బ్రెజిల్ జట్టుకు లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. అయినప్పటికీ బ్రెజిల్ ఓటమిని ఆయన తప్పించలేకపోయారు. మ్యాచ్ ముగిసిన వెంటనే 34 ఏళ్ల నేమార్ మైదానంలోనే తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

ఎక్కడ మొదలైందో.. అక్కడే ముగిసింది: ఈ ఘోర పరాజయం అనంతరం నెయ్‌మార్ ఒక ప్రముఖ అంతర్జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు భావోద్వేగంగా ప్రకటించారు. “నేను బ్రెజిల్ జట్టును గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించాను, ఎంతో పోరాడాను. కానీ నా అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రయాణం ఏ మెట్‌లైఫ్ స్టేడియంలోనైతే ప్రారంభమైందో, సరిగ్గా ఇక్కడే ముగిసింది. ఇక అంతా అయిపోయింది” అని నెయ్‌మార్ వ్యాఖ్యానించారు. నెయ్‌మార్ 2010లో అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున ఇదే మెట్‌లైఫ్ స్టేడియంలో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మైదానంలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి కెరీర్‌ను ముగించడం కాకతాళీయం.

Also read-WT20 World Cup: ఏడోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఆసీస్‌

రికార్డుల రారాజుగా నిష్క్రమణ: నెయ్‌మార్ తన అంతర్జాతీయ కెరీర్‌లో బ్రెజిల్ తరఫున ఎవరికీ సాధ్యంకాని అద్భుత రికార్డులను నెలకొల్పారు. బ్రెజిల్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధికంగా 80 గోల్స్ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డుతో ఆయన కెరీర్‌ను ముగించారు. దిగ్గజ ఆటగాడు కఫు తర్వాత బ్రెజిల్ జట్టు తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా నెయ్‌మార్ నిలిచారు. ఒక ప్రపంచకప్ సాధించాలనే కల నెరవేరనప్పటికీ, బ్రెజిల్ సాకర్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా నెయ్‌మార్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News