Wednesday, February 11, 2026
HomeTop StoriesKTR SIT notice: కేటీఆర్‌కు సిట్ షాక్: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రావాలని...

KTR SIT notice: కేటీఆర్‌కు సిట్ షాక్: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రావాలని నోటీసులు

KTR News: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ కుటుంబం ముంగిటకు చేరింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ సెగలు పుట్టిస్తున్న ఈ వ్యవహారంలో తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు అంటే జనవరి 23 ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన అధికారులు.. ఇప్పుడు కేటీఆర్‌ను కూడా విచారణకు పిలవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

- Advertisement -

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీకి చెందిన కీలక నేతలు.. ప్రత్యర్థి పార్టీల నాయకులతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా కొందరు పోలీస్ ఉన్నతాధికారుల అండతో ప్రతిపక్ష నేతల వ్యూహాలను పసిగట్టేందుకు ఈ ట్యాపింగ్ జరిగిందని, ఇందులో రాజకీయ పెద్దల ప్రమేయం ఉందనే కోణంలో సిట్ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే అరెస్టైన పోలీస్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతలకు నోటీసులు ఇస్తోంది సిట్.

also read Ashika Ranganath: ఆషికా రంగనాథ్ హాట్ హాట్ అందాలు చూశారా?

సొంత పార్టీ నేతలపైనే నిఘా..?
ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కేవలం విపక్ష నేతలే కాకుండా, అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీలోని కీలక నాయకులపై కూడా నిఘా పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీలోని కొందరు నాయకుల కదలికలపై అనుమానంతో వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించినట్లు విచారణలో ప్రాథమిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసలు ఈ ఆపరేషన్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఎవరి ఆదేశాల మేరకు డేటాను సేకరించారు? అనే విషయాలను రాబట్టేందుకు సిట్ దర్యాప్తును స్పీడప్ చేసింది.

మరోవైపు ఈ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, తమ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు విచారణతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలవ్వగా.. ఇప్పుడు కేటీఆర్‌కు నోటీసులు అందడం రాజకీయ యుద్ధానికి దారి తీసింది. రేపు జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద హైడ్రామా నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కేటీఆర్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయోనని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News