Brij Bhushan Singh: యూపీలోని కైస్‌రంగజ్ మాజీ పార్లమెంట్ సభ్యుడు,బీజేపీనాయకుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు పెద్ద ఊరట లభించింది. లైంగిక దాడి కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్డు ఆయనను నిర్దోషిగా ప్రకటించి,విడుదల చేసింది.తీర్పు కోసం బ్రిజ్ భూషణ్ సింగ్ స్వయంగా కోర్టుకు వచ్చారు.
తీర్పు అనంతరం బ్రిజ్ భూషణ్ విలేకర్లతో మాట్లాడుతూ..నేను కోర్టు తీర్పు వినడానికి వచ్చాను. నా చేతుల్లో ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ కేసులో కూడా వినోద్ తోమర్ ని కూడా నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు ఉత్తర్వుల కాపీ ఇంకా అందలేదని సింగ్ తరఫున న్యాయవాది తెలిపారు.
నేను ఉరి వేసుకుంటా…
తీర్పు వచ్చిన తరువాత బ్రిజ్ భూషణ్ ఇలా అన్నారు. నా పై ఉన్న ఆరోపణలు రుజువై నాకువ్యతిరేకంగా తీర్పు ఇస్తే నేను ఉరి వేసుకుంటానని ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. ఈ రోజు, కోర్టు నన్ను, వినోద్ తోమర్‌ను గౌరవప్రదంగా నిర్దోషులుగా విడుదల చేసింది. ఇది నాకు, నా మద్దతుదారులకు ఎంతో ఆనందకరమైన విషయం”అంటూ చెప్పుకొచ్చారు.

