BRS MLCs: అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భారీ నిరసనకు దిగారు. మంత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. మండలి వెలుపల, లోపల ఆందోళన చేపట్టారు.
ప్లకార్డులతో హోరెత్తిన నిరసన: మండలి భవనం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. “మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి” అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని వారు మండిపడ్డారు.
Also read-CM Revanth Reddy: ‘ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి.. ఉడత ఊపులకు భయపడను’
ఎమ్మెల్సీలను అడ్డుకున్న మార్షల్స్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ప్లకార్డులు ప్రదర్శించవద్దని మార్షల్స్ వారించినప్పటికీ.. సభ్యులు వినకపోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మార్షల్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే అధికార పక్షం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చేచి చూడాలి.

