HomeTop StoriesCabinet meeting: మోదీ అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ.. పాతికమందికి ఇదే చివరి మంత్రివర్గ సమావేశం?

Cabinet meeting: మోదీ అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ.. పాతికమందికి ఇదే చివరి మంత్రివర్గ సమావేశం?

Cabinet meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం (నేడు) కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పైకి ఇది సాధారణ సమావేశంలా కనిపిస్తున్నప్పటికీ.. త్వరలోనే కేంద్ర మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించనున్నారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పనితీరు సరిగ్గా లేని కొందరు మంత్రులను కేబినెట్ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మంత్రులలో దాదాపు పాతిక మందికి పైగా ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుందనే చర్చ దిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

- Advertisement -

వివాదాస్పద మంత్రులకు ఉద్వాసన?: మంత్రుల పనితీరుతో పాటు.. వారి ప్రవర్తన వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పెద్ద సంఖ్యలో మంత్రులను సాగనంపేందుకు అధిష్టానం కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల కాలంలో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, ఇటీవల తీసుకున్న నిర్ణయాలు-వాటి ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రులు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరుపై సైతం ప్రధాని సమీక్షించనున్నారు.

Also read-Bandi Sanjay: బండి సంజయ్‌కి ఊహించని షాక్‌.. వెంటనే ఢిల్లీకి రావాలని అమిత్‌షా ఫోన్‌.. అసలేం జరుగుతోంది?

అంతర్జాతీయ పరిస్థితులపై చర్చ: కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో పాటు దేశ ఆర్థిక, భద్రతా వ్యవహారాలు కూడా ఈ భేటీలో ప్రధాన అజెండాగా మారనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై నిపుణులతో చర్చించనున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం దేశ ప్రజలపై అతి తక్కువగా పడేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రధాని మోదీ మంత్రులకు, ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలోని 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన ఐదుగురు మంత్రులు కలిపి మొత్తం 72 మంది మంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఏడాదిలో మోదీ ప్రభుత్వంలోని మంత్రులందరూ ఒకే వేదికపై సమావేశం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News