HomeTop StoriesSugar exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం

Sugar exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం

Sugar exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

సామాన్యులకు భారం కాకూడదనే ఈ నిర్ణయం: దేశీయంగా చక్కెర ధరలు సామాన్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ముడి చక్కెర (Raw Sugar), తెల్ల చక్కెర, మరియు శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దేశీయ మార్కెట్‌లో చక్కెర సరఫరాలో ఎలాంటి కొరత ఏర్పడకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. పండుగల సీజన్ లేదా ఇతర కారణాల వల్ల చక్కెర ధరలు పెరగకుండా నియంత్రించడం ద్వారా వినియోగదారులకు ఊరటనివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also read-Air India: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. 100 విమాన సర్వీసులు నిలిపివేత!

మినహాయింపులు: చక్కెర ఎగుమతులపై తక్షణమే నిషేధం విధిస్తున్నప్పటికీ.. ఎగుమతి కోసం నౌకల్లో లోడింగ్ ప్రారంభమైన స్టాక్‌కు అనుమతి ఉంటుంది. అలాగే కస్టమ్స్‌కు అప్పగించిన నిల్వలను సైతం ఎగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా ముందస్తు ఒప్పందాల ప్రకారం అమెరికా, ఐరోపా దేశాలకు ఈ ఎగుమతుల నిషేధం వర్తించదని ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News