Chandrababu Naidu: తెలంగాణలోని ఆస్తులన్నీ తెలుగువారే అనుభవిస్తున్నారని..దానికి తాను ఎప్పుడూ బాధపడేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల పంపకం సరిగా జరగలేదని ఆయన అన్నారు.2019 తరువాత రాష్ట్రం ఎన్ని విధాలుగా నాశనం అవ్వాలో అన్ని విధాలుగా నాశనం అయ్యిందని పేర్కొన్నారు. 2024 లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే బ్రాండ్ ఏపీని పునరుద్దరించినట్లు ఆయన వివరించారు.
ఏమేం చెప్పామో అవన్నీ…
2014 ఎన్నికల సమయంలో ఏమేం చెప్పామో అవన్నీ చేస్తున్నామని, 2025-26లో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారుచేశామని సీఎం చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మంగళవారం ఆర్థిక శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు.
‘ఆర్థిక శాఖలో రెండు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఎలాంటి ఎఫర్ట్ పెట్టామనేది అందరికి తెలియాలి. పాలన బాగుంటే ప్రజల మీద పెద్ద ప్రభావితం చేస్తుంది. నెగటివ్ గవర్నన్స్ ఉంటే నెగటివ్ ప్రభావం చేస్తుంది. 2024లో ఒక అఖండ విజయం సాధించాం. 2019-24లో విధ్వంస పాలన సాగింది. ప్రజలందరూ భయంతో బ్రతికారు. 1982 ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక విప్లవం.. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చాయి. 2024లో ఊహించని విప్లవం.. ఒక బాధ్యతతో ఎప్పడికప్పుడు ప్రోగ్రెస్ ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాము’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
బస్సులో ఉండి పరిపాలించాల్సిన…
‘2014లో బస్సులో ఉండి పరిపాలించాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణించాల్సి వచ్చింది. తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎక్కడా కూడా రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు. 2014-19 లో ఆంధ్రప్రదేశ్ ని పునఃనిర్మించుకోవాల్సిన పరిస్థితి లో ఉన్నాము. 2019 లో వచ్చిన పాలనకి ప్రజలు బయటకి రావటానికి కూడా బెంబేలెత్తిపోయారు.
రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి, అభివృద్ధి కుంటుపడింది. 2024 ఎన్నికల్లో ఏవి చెప్పామో అవి చేస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం అన్నిటిని నిలబెట్టుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read:Crop Holiday: క్రాప్ హాలీడే ప్రకటించిన కోనసీమ రైతులు

