Telangana High Court: తెలంగాణలో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న నూతన హైకోర్టు భవన సముదాయానికి పునాది రాయి పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో హైకోర్టు జోన్-2 భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు.
హాజరైన సీఎం రేవంత్ రెడ్డి: శంకుస్థాపన అనంతరం అధికారులు నిర్మాణ పనుల ప్రణాళికను సుప్రీంకోర్టు సీజేఐకి వివరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
Also read-Babu Jagjivan Ram: నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి.. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
అత్యాధునిక హంగులతో కొత్త భవనం: పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రాజేంద్రనగర్‌లో విశాలమైన విస్తీర్ణంలో ఈ నూతన భవనాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణహితంగా, అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో ఈ జోన్-2 భవనాన్ని తీర్చిదిద్దనున్నారు. న్యాయవ్యవస్థకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శంకుస్థాపన అనంతరం అధికారులు నిర్మాణ పనుల ప్రణాళికను వివరించారు.

