ప్రొద్దుటూరు, (తెలుగు ప్రభ) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్ల స్వర్ణాంధ్రప్రదేశ్ రూప శిల్పి విజనరీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లు మొదటిసారిగా ప్రొద్దుటూరు గడ్డపై అభివృద్ధిని వేగవంతం చేసేందుకు విచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతున్నట్లు కడప జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్వీ రమణ తెలిపారు.
ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం వివిధ రంగాలకు విశేషమైన నిధులను మంజూరు కు కృషి చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామిగా నిలిచి యువతకు స్ఫూర్తిగా భవిష్యత్తు నాయకుడిగా ఎదుగుతున్న యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు నాయకత్వం అంటే పదవి కాదు ప్రజల వద్ద ఉండటం కార్యకర్తలకు అండగా నిలవడం ప్రాంత అభివృద్ధిని తన బాధ్యతగా భావించడమే అని తెలిపారు ఇలాంటి లక్షణాలను ఆచరణలో చూపిస్తున్న నంద్యాల కొండారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గం తండ్రి తనయుడు ల నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జలజీవన్ మిషన్ ను ప్రారంభించేందుకు విచ్చేస్తున్న సీఎం డిప్యూటీ సీఎం లకు ఆయన సాదర స్వాగతం పలికారు సీఎం డిప్యూటీ సీఎంల పర్యటన ప్రొద్దుటూరు అభివృద్ధికి నూతన శక్తిని అందించాలని ఆయన కోరారు.

