HomeTop StoriesCM Revanth Reddy: బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌!

CM Revanth Reddy: బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌!

Free electricity: సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు బహిరంగ సవాల్‌ విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టి.. రైతులకు ఉచిత విద్యుత్‌ నిలిపివేస్తే తాము ఎన్నికల్లో పోటీ చేయబోమన్నారు. ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తే బీఆర్ఎస్‌ ఎన్నికలకు దూరంగా ఉంటుందా? అని ప్రశ్నించారు.

- Advertisement -

డిస్కంతో జవాబుదారీతనం: కేసీఆర్‌ రైతుల ముసుగులో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌ వినియోగాన్ని దీనికి కనెక్ట్‌ చేస్తున్నామని అన్నారు. రైతు డిస్కంతో జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు.

Also read-AP CM Chandrababu: “టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై.. బక్కని నర్సింహులు వ్యాఖ్యలు సరికాదు”

ఎలాంటి అపోహలకు తావులేదు: రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ఒకవేళ రైతులకు ఉచిత విద్యుత్‌ను నిలిపివేస్తే తాము భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయబోమని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో రైతులకు మరింత మెరుగైన, నిరంతరాయ విద్యుత్ అందుతుందని అన్నారు. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని సీఎం స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News