CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి నేడు దిల్లీ వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారనుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
హైకమాండ్‌తో కీలక భేటీ!: ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావంపై చర్చించనున్నారు. అనంతరం ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీతో పాటు, పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను మార్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు ఐదు నుండి ఆరు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర కీలక నామినేటెడ్ పోస్టుల నియామకాలపై ఈ పర్యటనలోనే క్లారిటీ రానుంది.
Also read-Keralam Elections: కేరళంలో యూడీఎఫ్ హవా.. సీఎం రేవంత్ ట్వీట్ వైరల్
కేంద్ర మంత్రులతో భేటీ: కాంగ్రెస్ హైకమాండ్‌తో పాటుగా రాష్ట్ర అభివృద్ధి నిధుల కోసం కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాల పురోగతిపై పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి జరిపే భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ కూర్పుపై ఆయన ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసమే పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ పర్యటన ముగిసిన వెంటనే రాష్ట్రంలో పాలనాపరమైనపరమైన అంశాలతో పాటు రాజకీయ పరమైన కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

