HomeTop StoriesCM Revanth Reddy: మరోసారి దిల్లీకి సీఎం.. మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ!

CM Revanth Reddy: మరోసారి దిల్లీకి సీఎం.. మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ!

CM Delhi tour: సీఎం రేవంత్ రెడ్డి మరోమారు దిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 16న దిల్లీకి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాలనాపరమైన అంశాలతో పాటు.. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏఐసీసీ (AICC) అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో సీఎం దిల్లీ టూర్‌ ఆసక్తికరంగా మారింది

- Advertisement -

మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఈ పర్యటనతో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేరళ సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో.. ఏఐసీసీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించింది. దీంతో మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేయడంపై కసరత్తు జరుగుతోంది. సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లుగా తెలుస్తోంది.

Also read-Sugar exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం

మంత్రుల శాఖల్లో మార్పు!: ఒక ఎస్టీ (లంబాడా) సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు కల్పించాలని ఇప్పటికే అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను సైతం మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మంత్రి వర్గ విస్తరణ అంశం రాష్ట్ర రాజకీయల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముందుగా నిర్ణయించిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న సీఎం అదే సమయంలో పార్టీ సంస్థాగత మార్పులు మరియు ప్రభుత్వ ప్రాధాన్యతలపై హైకమాండ్‌తో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News