HomeTop StoriesVinayaka Chavithi: ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి

Vinayaka Chavithi: ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి

Vinayaka Chavithi: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుడి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజల జీవితాల్లోని అడ్డంకులన్నీ తొలగిపోయి, అందరూ ఆనందారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకున్నారు. ఈ ఏడాది గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిపే ప్రతి గణేశ్ మండపానికి ప్రభుత్వం తరఫున ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: పండుగ వేడుకల వేళ ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరం సహా అన్ని జిల్లా కేంద్రాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రధాన వినాయక మండపాల వద్ద ఎస్పీలు, కమిషనర్లు పర్యవేక్షించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News