HomeTop StoriesTelangana: త్వరలో మంత్రివర్గ విస్తరణ.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

Telangana: త్వరలో మంత్రివర్గ విస్తరణ.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

Cabinet expansion: తెలంగాణలో గత కొంతకాలంగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం.. అక్కడి మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

పూర్తిస్థాయి కేబినెట్ లక్ష్యం: మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా ఈసారి పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏళ్లు కావస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు పాలనలో వేగం పెంచేలా ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రక్షాళనతో కూడిన విస్తరణ?: కేవలం ఖాళీలను భర్తీ చేస్తారా లేక మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొందరు మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో వారి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు సరిగా లేని వారిని తప్పించి.. అదే సామాజిక వర్గాలకు చెందిన సమర్థులైన నేతలకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రచార బాధ్యతల నుండి ఫ్రీ అయిన తర్వాత ఈ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగియగానే తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే సంకేతాలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమయ్యాయి.

Also read-Meeseva: నేటి నుంచి మీసేవ కేంద్రాలు బంద్.. మళ్లీ పునః ప్రారంభం ఎప్పుడంటే?

కేరళ వేదికగా గ్యారంటీల వివరణ: కేరళ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ పనితీరును వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరు గ్యారంటీల పురోగతి గురించి తెలిపారు. రైతు భరోసా కోసం ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. రైతు రుణమాఫీ వల్ల కలిగిన ప్రయోజనాలను లెక్కలతో సహా తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ పథకాల లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News