Friday, March 13, 2026
HomeTop StoriesHyderabad: కోర్ అర్బన్ కోసం కొత్త చట్టం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

Hyderabad: కోర్ అర్బన్ కోసం కొత్త చట్టం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

CM Revanth Reddy: హైదరాబాద్ మహానగర పరిధిలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బన్) మూడు కార్పొరేషన్లకు వర్తించేలా.. ప్రస్తుత జీహెచ్ఎంసీ (GHMC) చట్టం స్థానంలో నూతన ‘కోర్ అర్బన్ చట్టాన్ని’ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మున్సిపల్ శాఖ సమీక్షలో ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

- Advertisement -

పారిశుద్ధ్యానికి పెద్దపీట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నిరోధించేందుకు, చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి. రోడ్ల నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడాలి. వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. నగర పరిధిలోని ఆర్ అండ్ బీ సహా ఇతర విభాగాల రోడ్లన్నింటినీ మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకురావాలని సీఎం సూచించారు.

హోటల్ కిచెన్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి: నగర ప్రజల ఆరోగ్యంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. నగరంలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీటిని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. తరచూ తనిఖీలు చేస్తూ, హోటళ్ల సేఫ్టీ ప్రమాణాలను మదింపు చేయాలని ఆదేశించారు.

చెరువుల సుందరీకరణ: నగరంలో 50 అంతస్తులకు పైగా భవనాలు వస్తున్న నేపథ్యంలో.. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అత్యాధునిక సాంకేతికతను సమకూర్చుకోవాలని సీఎం తెలిపారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలి. హైడ్రా రక్షించిన చెరువుల చుట్టూ కేవలం కట్టలు కట్టి వదిలేయకుండా, వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సుందరీకరణ పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News