Telangana Public School: తెలంగాణ సర్కార్ విద్యలో నూతన విప్లవం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్(TPS)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అత్యాధునిక డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను స్వయంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాక.. విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్‌ఫాస్ట్ చేశారు.
అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన: దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ‘విద్యా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డిల ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యాబోధన అందించనున్నారు.
Also read-CM Revanth: సర్కార్ విద్యలో నూతన విప్లవం
కార్పొరేట్ స్థాయి సదుపాయాలు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఈ రోల్ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు అద్భుతమైన వసతులు కల్పిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థుల కోసం 5 ప్రత్యేక స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం, సాయంత్రం స్నాక్స్ ఉచితంగా అందిస్తారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ అత్యధునిక మైదానాలతో పాటు ప్రత్యేక కోచ్‌లనునియమించారు.

