HomeTop StoriesTelangana: మురిసిన తెలంగాణ.. ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!

Telangana: మురిసిన తెలంగాణ.. ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్రం ముస్తాబైంది. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు పూర్తిచేసుకుంటున్న తరుణంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అవతరణ సంబురాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.

- Advertisement -

అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణం: స్వరాష్ట్ర కల సాకారమై 12 ఏండ్లు పూర్తిచేసుకుంటున్న తరుణంలో.. తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. దశాబ్దాల పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలంగా జూన్ 2, 2014న ఉద్భవించిన తెలంగాణ రాష్ట్రం.. నేడు సగర్వంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Also read-Telangana: త్యాగాల పురిటిగడ్డ.. నేటి స్వేచ్ఛా తెలంగాణ!

పరేడ్ గ్రౌండ్స్‌లో మిన్నంటిన ఉత్సాహం: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారిక వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, రాబోయే రోజుల్లో చేపట్టబోయే సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉదయం 8:30 గంటలకే వేడుకలను ప్రారంభించి.. 10 గంటల కల్లా ముగించేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News