HomeTop StoriesVanamahotsavam: నేటి నుంచి వనమహోత్సవం.. నాగలింగం మొక్కను నాటనున్న సీఎం!

Vanamahotsavam: నేటి నుంచి వనమహోత్సవం.. నాగలింగం మొక్కను నాటనున్న సీఎం!

Vanamahotsavam: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా రేవంత్‌ సర్కార్‌ సరికొత్త ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు వనమహోత్సవం-2026 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని ఎకో పార్క్‌లో నాగలింగం మొక్కను నాటి.. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

- Advertisement -

వృక్షాలు-జీవనాధారం: వనమహోత్సవం-2026 కార్యక్రమాన్ని “వృక్షాలు-జీవనాధారం” అనే థీమ్‌తో ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఏకంగా 16.06 కోట్ల మొక్కలను నాటాలని రేవంత్‌ సర్కార్‌ దృఢనిశ్చయం ముందుకు సాగుతోంది. పలుశాఖల వారీగా లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ముందస్తు ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,642 ప్రభుత్వ నర్సరీల్లో ఇప్పటికే 15.61 కోట్ల మొక్కలను అధికారులు సిద్ధం చేశారు.

Also read-Telangana: మీసేవ కేంద్రాలకు రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు.. ఇకనుంచి నో రిసీప్ట్‌!

భూముల్ని కాపాడటంతో పచ్చదనం పెంపు: గుర్రంగూడలోని 102 ఎకరాల భూమిపై కొంతకాలంగా న్యాయవివాదం నెలకొంది. అయితే ఇటీవల ఈ 102 ఎకరాలు అటవీశాఖ భూములేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ భూముల్ని రిజర్వు ఫారెస్ట్‌గా అటవీశాఖ ప్రకటించింది. అయితే ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఈ సారి ఈసారి వనమహోత్సవం గుర్రంగూడలో ప్రారంభించాలని సీఎం రేవంత్‌ నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌ నేడు నాగలింగం మొక్కను నాటనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News