CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలు, నిధుల విడుదల, కీలక ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రంతో చర్చించడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నాయి. ఈ పర్యటనలో సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఉన్నారు.
షెడ్యూల్ వివరాలు: ఉదయం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నిలిచిపోయిన వివిధ నీటిపారుదల, రోడ్డు నిర్మాణాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ మరియు పర్యావరణ అనుమతులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో భేటీ జరగనుంది. తెలంగాణలోని ప్రాజెక్టుల పురోగతి, కృష్ణా-గోదావరి నదీ జలాల కేటాయింపులు, విభజన సమస్యలు, జాతీయ హోదా మరియు కేంద్ర నిధుల కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రంలో పర్యావరణ అనుమతుల సాకుతో నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడం, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు త్వరగా క్లియరెన్స్‌లు తెప్పించడమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనను వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నారు. కేంద్ర మంత్రులతో జరిగే అధికారిక సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read-Prajavani: ప్రజలకు మరింత చేరువగా రేవంత్ సర్కార్.. ఇకపై మండలాల్లో ప్రజావాణి

