HomeTop StoriesJayashankar: ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం

Jayashankar: ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం

Jayashankar birth anniversary: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సైద్ధాంతిక కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధనలో జయశంకర్ సార్ అందించిన అసమాన సేవలను సీఎం స్మరించుకున్నారు.

- Advertisement -

ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు: తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను ప్రపంచ వేదికపై బలంగా వినిపించడంలోనూ, ప్రత్యేక ఉద్యమానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయడంలోనూ జయశంకర్ సార్ పాత్ర చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. తన జీవితాంతం తెలంగాణ హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసమే తపించిన గొప్ప విద్యావేత్త, మేధావి అని కొనియాడారు. “జయశంకర్ సార్ ఆశయాలు, నైతిక విలువలు, ఉద్యమ నిబద్ధత నేటి తరానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆయన చూపిన మార్గమే మాకు ఎల్లప్పుడూ ఆదర్శం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Also Read-Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2026.. అధికారులకు సీఎస్‌ కీలక ఆదేశాలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News