HomeTop StoriesCM Revanth Reddy: "రక్తదానం.. ఒక ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నత మానవతా సేవ"

CM Revanth Reddy: “రక్తదానం.. ఒక ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నత మానవతా సేవ”

World Blood Donor Day: రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నతమైన మానవతా సేవ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో రక్తదానం పట్ల నిరంతరం చైతన్యం కలిగిస్తూ.. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా సంస్థల కృషిని కొనియాడారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం(జూన్ 14) సందర్భంగా రాష్ట్రంలోని రక్తదాతలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా సీఎం ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.

- Advertisement -

ప్రాణదాతలుగా నిలవండి: ఒకరు చేసే రక్తదానం మరొకరి జీవితాన్ని కాపాడటమే కాకుండా.. వారి కుటుంబాల్లో సరికొత్త ఆశలను నింపుతాయని తెలిపారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఇతరుల ప్రాణాలను కాపాడే ఈ మహత్తర కార్యంలో భాగస్వాములై ప్రాణదాతలుగా నిలవాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది (2026) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) “One Drop of Humanity. Give Blood. Save Lives”(మానవత్వపు ఒక్క చుక్క.. రక్తాన్నివ్వండి, ప్రాణాలను కాపాడండి) అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.

“రక్తదానం.. ఒక ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నత మానవతా సేవ. ఒకరి రక్తదానం మరొకరి జీవితాన్ని కాపాడుతుంది. వారి కుటుంబంలో కొత్త ఆశలను నింపుతుంది. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడే మహత్తర కార్యంలో భాగస్వాములై ప్రాణదాతలుగా నిలవాలి”- సీఎం రేవంత్ రెడ్డి

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News