Yadagirigutta: సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. స్వామివారి దర్శనంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎంం శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ :
- ఉదయం 09:00 గంటలకు: హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి యాదగిరిగుట్టకు చేరుకుంటారు.
- ఉదయం 09:15 గంటలకు: నేరుగా స్థానిక వేద పాఠశాలకు చేరుకున.. అక్కడ నిర్మించనున్న నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
- ఉదయం 10:00 గంటలకు: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుంటారు.
- ఉదయం 10:30 గంటలకు: ఆలయ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ పనుల గురించి ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
- ఉదయం 11:15 గంటలకు: యాదగిరిగుట్ట పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు.
అధికారుల అప్రమత్తత: సీఎం పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల సమీక్షలో ముఖ్యమంత్రి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

