CM Vijay floor test Win: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో విజయం సాధించింది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఓటింగ్‌లో విజయ్ సర్కార్‌కు భారీగా మద్దతు లభించింది.
విజయ్ ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు: తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలు కలవు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. అయితే విజయ్ ప్రభుత్వానికి ఏకంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేవలం 22 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ ఓటింగ్‌ను బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేయగా.. అన్నాడీఎంకేలోని ఒక చీలిక వర్గం విజయ్‌కు మద్దతు తెలిపింది.
Also read-PM Modi: నా కాన్వాయ్ సైజ్‌ను సగానికి తగ్గించండి.. ఎస్‌పీజీకి మోదీ కీలక ఆదేశాలు!
ఇది ప్రజా కూటమి: బలపరీక్షలో నెగ్గిన అనంతరం సీఎం విజయ్ భావోద్వేగంగా ప్రసంగించారు. “మా పార్టీ గుర్తు విజిల్ తమిళనాడు రాజకీయ చరిత్రనే మార్చివేసింది. పార్టీ స్థాపించిన మూడేళ్లలోనే అధికారంలోకి రావడం ప్రజల ఆశీర్వాదమే.” అని విజయ్ అన్నారు. ఇది కేవలం ఒక పార్టీ ప్రభుత్వం కాదు.. ఇది ప్రజా కూటమి అని తెలిపారు. మాకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారు కూడా మా వారేనని విజయ్ అన్నారు. ఈ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల అండదండలతో మా ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటుందని తెలిపారు.

