HomeTop StoriesCM Vijay: ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టొద్దు.. పార్టీ కేడర్‌కు సీఎం విజయ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

CM Vijay: ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టొద్దు.. పార్టీ కేడర్‌కు సీఎం విజయ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

CM Vijay Sensational Decision: తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. వచ్చి రాగానే పలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. సామాజిక భద్రతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రజల విజ్ఞప్తులకు పెద్ద పీఠ వేస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే తరలించాలని అధికారులను ఆదేశించిన విజయ్‌.. కొద్ది గంటల్లోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగేలా ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు తప్పవని తన పార్టీ కేడర్‌ను హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు కడితే ఉపేక్షించేది లేదని తెగేసి చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని తమ పార్టీ శ్రేణులకు సూచించారు. పుట్టినరోజు వేడుకలు లేదా కుటుంబ శుభకార్యాలు వంటి ఏ సందర్భంలోనైనా.. పబ్లిక్ స్థలాల్లో, రద్దీగా ఉండే వీధుల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయకూడదని టీవీకే నేతలకు హితవు పలికారు. ప్రజల రాకపోకలకు, సాధారణ ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించేలా ప్రదర్శనలు చేయడం, సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించేలా వేడుకలు నిర్వహించడం ఇకపై చెల్లదని స్పష్టం చేశారు.

- Advertisement -

ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయి..

ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీవీకే పార్టీ తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా పార్టీ కేడర్‌ను హెచ్చరించింది. క్రమశిక్షణ తప్పి అతిగా ప్రవర్తించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారిక ప్రకటనలో తెలిపింది. కేవలం రాజకీయ అధికారం కోసమే కాక.. ప్రజల శ్రేయస్సు కోసమే తాము పనిచేస్తున్నామని గుర్తించుకోవాలని హితవు పలికింది. సీఎం విజయ్‌ నిర్ణయానికి తగ్గట్లుగా పార్టీలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని పిలుపునిచ్చింది.

Also read: https://teluguprabha.net/telangana/kcr-serious-warning-to-brs-leaders/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News