Sunday, January 18, 2026
HomeTop StoriesCold Wave: వామ్మో!.. ఇదేం చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

Cold Wave: వామ్మో!.. ఇదేం చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

Today Weather updates: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉత్తర మరియు ఈశాన్య జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. రానున్న రెండు రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

- Advertisement -

శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 6.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇదే జిల్లాలోని వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి, ఆసిఫాబాద్ పట్టణ ప్రాంతాల్లోనూ శీతల గాలుల తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫాబాద్ తర్వాత సంగారెడ్డి జిల్లాలో అత్యధిక చలి నమోదైంది. కోహీర్ ప్రాంతంలో 9.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. జహీరాబాద్, ఝరాసంఘం, న్యాల్‌కల్, సిర్గాపూర్, నిజాంపేట, మొగుడంపల్లి వంటి మండలాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10.4 నుంచి 10.9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 14.6 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cold-wave-ap-weather-updates-in-andhra-pradesh/

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వెచ్చని దుస్తులు ధరించడం.
  • రాత్రిపూట ప్రయాణాలను తగ్గించడం.
  • తాగునీరు మరియు వేడి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం.

వైద్య నిపుణుల హెచ్చరిక: పశ్చిమ దిశ నుంచి వీచే శీతల గాలులు, వాతావరణంలో తేమ శాతం తగ్గడం వంటివి ఉష్ణోగ్రతల పతనానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ శీతల వాతావరణం వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ రికార్డు స్థాయి చలి ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రిపూట పనులకు వెళ్లే స్థానిక ప్రజల జీవనశైలిని ప్రభావితం చేస్తోంది. రానున్న రెండు రోజులు చలి తీవ్రత మరింత అధికమవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే ఏకంగా మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News