HomeTop StoriesCommonwealth Games: ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026

Commonwealth Games: ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026

Commonwealth Games 2026:స్కాట్లాండ్‌ లోని గ్లాస్గో నగరంలో 11 రోజుల పాటు హోరాహోరీగా సాగిన కామన్వెల్త్‌ క్రీడలు 2026 ఘనంగా ముగిశాయి.జులై23న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ పోటీలు ఆదివారం తెల్లవారుజామున ముగిశాయి. ఈసారి గ్లాస్గో నిర్వాహకులు బడ్జెట్ కారణాల వల్ల ఈవెంట్ల సంఖ్యను కుదించి, కేవలం 10 క్రీడా విభాగాల్లో మాత్రమే పోటీలను నిర్వహించారు.

- Advertisement -

74 దేశాలకు చెందిన..

అయినప్పటికీ, 74 దేశాలకు చెందిన వేలాది మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా వేడుకల్లో భారత అథ్లెట్లు తమ ప్రతిభతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. పాయింట్స్ టేబుల్‌లో టాప్-5లో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. అనుకున్నది సాధించింది. భారత్ తరఫున రేసులో నిలిచిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో మొత్తం 39 పతకాలను చేజిక్కించుకున్నారు.

ఇందులో 13 బంగారు పతకాలు, 17 వెండి పతకాలు, 9 కాంస్య పతకాలు మెరిశాయి. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడాల తర్వాతి స్థానంలో నిలిచి నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది.

Also Read: Tanvi Sharma:18 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన యువ కెరటం

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News