HomeTop StoriesSiddipet: బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్.. కంగుతిన్న మందుబాబు!

Siddipet: బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్.. కంగుతిన్న మందుబాబు!

Condom packet in beer bottle: సిద్దిపేట జిల్లాలోని అక్బర్‌పేట భూంపల్లిలో గల ఒక వైన్ షాపులో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. ఇక్కడి వైన్స్‌లో ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. దీంతో బీర్ సీసా కొనుగోలు చేసిన ఒక్కసారిగా కంగుతిన్నాడు.

- Advertisement -

అసలేం జరిగిందంటే?: భూంపల్లిలోని వైన్ షాపులో ఒక వ్యక్తి బీర్ సీసాను కొనుగోలు చేశాడు. అయితే దానిని తాగేందుకు సిద్ధమవగా.. సీసా లోపల ఏదో ప్యాకెట్ తేలుతూ కనిపించింది. నిశితంగా గమనించగా అది కండోమ్ ప్యాకెట్ అని తేలడంతో సదరు వినియోగదారుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. గతంలోనూ ఇదే వైన్ షాపులో తాను బీర్ కొనగా.. అందులో కేవలం నీరు మాత్రమే ఉందని అన్నారు. ఇప్పుడు ఏకంగా ఇలాంటి వస్తువులు రావడం దారుణమని సదరు కస్టమర్ వాపోయాడు.

వైన్స్ ముందు ఉద్రిక్తత: ఈ విషయం తెలియడంతో వైన్ షాపు వద్ద ఉన్న మిగతా మద్యం ప్రియులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ వైన్ షాపు నిర్వాహకులను నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో.. వినియోగదారులంతా కలిసి వైన్స్ ముందు ధర్నాకు దిగారు. నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also read-Telangana: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. సీనియర్లకు చెక్ పెట్టనున్న రేవంత్ రెడ్డి!

రంగంలోకి ఎక్సైజ్ శాఖ: వైన్ షాపు వద్ద ఆందోళన జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్సై సరిత సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. నిరసనకారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్నామని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిబంధనల ప్రకారం వైన్ షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సరిత హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News