HomeTop StoriesWar effect: కండోమ్ల కొరత.. వైద్య నిపుణుల హెచ్చరిక!

War effect: కండోమ్ల కొరత.. వైద్య నిపుణుల హెచ్చరిక!

Condoms shortage: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. అయితే యుద్ధ పరిస్థితులు ఆరోగ్య రంగంపై సైతం పెను ప్రభావాన్ని చూపేలా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాల వల్ల దేశంలో కండోమ్‌ల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ముడిసరుకు దిగుమతులకు బ్రేక్: కండోమ్‌ల తయారీలో కీలకమైన లేటెక్స్ ప్రాసెసింగ్ కోసం కొన్ని ప్రత్యేక రకాల పెట్రోకెమికల్స్ అవసరమవుతాయి. అయితే భారత్ వీటి కోసం ప్రధానంగా ఇరాన్‌పై ఆధారపడుతుంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఈ రసాయనాల దిగుమతులు నిలిచిపోయాయి. ఇది నేరుగా దేశీయ కండోమ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది.

Also read-Census-2027: కేంద్రం సంచలన నిర్ణయం.. సహజీవన జంటలకు కుటుంబ హోదా!

ప్రజారోగ్యంపై ప్రభావం: కండోమ్‌ల లభ్యత తగ్గితే కలిగే పరిణామాలపై ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ లేని శృంగారం వల్ల దేశంలో హెచ్‌ఐవీ కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. గర్భనిరోధక సాధనాల కొరత వల్ల కుటుంబ నియంత్రణ లక్ష్యాలకు గండి పడే ప్రమాదం ఉంది. ఇతర సుఖ వ్యాధులు కూడా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముడిసరుకును దిగుమతి చేసుకోకపోతే.. భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News