HomeTop StoriesTamil Nadu: టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు?.. వెన్నుపోటుదారు అంటూ డీఎంకే నిప్పులు!

Tamil Nadu: టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు?.. వెన్నుపోటుదారు అంటూ డీఎంకే నిప్పులు!

TVK party: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఊహించని విధంగా వచ్చాయి. దీంతో తమిళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయ్‌ పార్టీ టీవీకే భారీ సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో నిలిచింది. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గిరిష్ చండోకర్ మంగళవారం రాత్రి పార్టీ నేతలతో జరిపిన భేటీలో విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు!: ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ప్రస్తుతం టీవీకే గెలిచిన సీట్ల సంఖ్య 108. అయితే ఈ 108లో ఆ పార్టీ అధినేత విజయ్‌ రెండు చోట్ల గెలిచారు. దీంతో ప్రస్తుతం వారి బలం 107కు తగ్గనుంది. ఈ తరుణంతో విజయ్‌ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు 11సీట్ల దూరంలో ఉన్నారు. దీంతో ఆ పార్టీకి కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చేందుకు ముందుకచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ 5సీట్లు గెలిచింది. కాంగ్రెస్‌ మద్దతిచ్చినప్పటికీ.. విజయ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ఇండియా మిత్రపక్షాల వైపు విజయ్ చూపు?: ఇండియా కూటమిలోని ఇతర పార్టీలైన సీపీఐ, సీపీఎం, వీసీకే(CPI, CPM, VCK ) తలా రెండు సీట్లు గెలిచాయి. వాటితో పాటుగా ఐయూఎంఎల్‌, డీఎండీకే(IUML, DMDK) ఒక్కొక్క సీటు గెలిచాయి. దీంతో వీరి మద్దతును కూడా విజయ్ కోరే అవకాశం కనిపిస్తోంది. అయితే దశాబ్దాలుగా డీఎంకేతో కలిసి నడుస్తున్న ఈ పార్టీలు.. కూటమి కట్టుబాట్లను కాదని విజయ్‌కు మద్దతు ఇస్తాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

డీఎంకే ఆగ్రహం.. వెన్నుపోటుదారంటూ నిప్పులు: ఒకవైపు ఇండియా కూటమిలో ఉంటూనే.. మరోవైపు తమ ప్రత్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంపై డీఎంకే అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ముఖ్యంగా డీఎంకే నేత శరవణన్ అన్నాదురై సోషల్ మీడియాలో చేసిన “వెన్నుపోటుదారు” అనే పోస్ట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తమతో పొత్తు కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్లేటు ఫిరాయించడం నైతికత కాదని డీఎంకే వర్గాలు మండిపడుతున్నాయి. అయితే విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల మద్దతుపై రేపటికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News