Minister Rajnath Singh: ఆపరేషన్ సింధూర్‌లో ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశరక్షణలో ఎయిర్‌ఫోర్స్ అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్‌ఫోర్స్ చాలా కీలకమని వ్యాఖ్యానించారు.
అనునిత్యం అప్రమత్తం: యుద్ధంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు మంత్రి హాజరయ్యారు. దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. పెరిగిన సాంకేతికతను ఎయిర్‌ఫోర్స్ అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు. టెక్నాలజీ ప్రపంచంలో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.
Also read-TPCC: ప్రియాంక గాంధీతో టీపీసీసీ మహేష్ కుమార్ భేటీ.. కీలక మార్పులకు సంకేతమా?
క్రీడా, సినీ ప్రముఖులతో భేటీ అయిన రాజ్‌నాథ్: హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ క్రీడా, సినీ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, దేశ రక్షణ రంగంలో సాధించిన పురోగతిని వివరించారు. ఈ భేటీకి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారుడు శ్రీకాంత్ కిదాంబి, ఒలింపిక్ షూటర్ ఇషా సింగ్ హాజరై రక్షణ మంత్రితో ముచ్చటించారు. క్రీడా రంగానికి కేంద్రం అందిస్తున్న మద్దతుకుగాను.. మోదీ సర్కార్‌ను వారు అభినందించారు. టాలీవుడ్ నుండి యువ సంచలనం, ‘హనుమాన్’ ఫేమ్ నటుడు తేజ సజ్జా, వైవిధ్యభరిత చిత్రాల హీరో అడివి శేష్‌లు రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రత్యేకంగా కలిశారు.

