HomeTop StoriesPakistan: బర్రెలకు డైపర్లు.. లేదంటే జరిమానా!

Pakistan: బర్రెలకు డైపర్లు.. లేదంటే జరిమానా!

Diapers for Buffaloes: వింత నిర్ణయాలకు పెట్టింది పేరు పాకిస్తాన్. తాజాగా అక్కడి పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పట్టణాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం మరియు బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం గోబర్ ట్యాక్స్(పేడ పన్ను)ను అమల్లోకి తెచ్చింది.

- Advertisement -

రోజుకు రూ. 30 పన్ను: ప్రభుత్వం చేపట్టిన సుత్రా పంజాబ్ కార్యక్రమంలో భాగంగా నగర ప్రాంతాల్లో పశువులను పెంచేవారు ప్రతి బర్రెకు రోజుకు 30 పాకిస్తానీ రూపాయలను పన్నుగా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో పశువుల కాపరులు తీవ్ర ఆందోళనలో పడ్డారు.

పన్ను తప్పించుకునేందుకు డైపర్ ఐడియా: ప్రభుత్వం విధించిన ఈ వింత పన్ను భారం నుండి తప్పించుకోవడానికి అక్కడి రైతులు వినూత్న మార్గాన్ని కనిపెట్టారు. “పేడ రోడ్డు మీద పడితేనే కదా పన్ను కట్టాలి.. అసలు పేడ కింద పడకుండా ఉంటే పన్ను కట్టక్కర్లేదు” అనే లాజిక్‌తో తమ బర్రెలకు డైపర్లు కడుతున్నారు. నిజానికి ప్రభుత్వం బర్రెలకు డైపర్లు వేయాలని ఎక్కడా చెప్పలేదు. కానీ పన్నులు మరియు జరిమానాల భయంతో రైతులు సొంతంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పూయిస్తోంది.

Also read-Delhi: ఎన్డీయే నేతల విందులో సీఎం రేవంత్.. దిల్లీలో ఆసక్తికర భేటీ!

నెట్టింట మీమ్స్ వెల్లువ: డైపర్లు ధరించిన బర్రెల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై రకరకాల సెటైర్లు వేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పేడ మీద పన్ను వేసే స్థాయికి వచ్చిందా? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. రేపు మనుషులపై కూడా ఇలాంటి వింత పన్నులు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. మొత్తానికి పరిశుభ్రత కోసం ప్రభుత్వం వేసిన పన్ను.. ఇప్పుడు పాకిస్తాన్ పరువును అంతర్జాతీయ స్థాయిలో హాస్యాస్పదంగా మార్చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News