HomeTop StoriesKarnataka: అల్పాహార విందులో ఆసక్తికర ఘటన.. సిద్ధూ కాళ్లు మొక్కిన డీకే!

Karnataka: అల్పాహార విందులో ఆసక్తికర ఘటన.. సిద్ధూ కాళ్లు మొక్కిన డీకే!

DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది పలికారు. ఈ రోజు ఉదయం తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన అల్పాహార విందులో సిద్ధరామయ్య స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విందులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

సిద్ధూ కాళ్లు మొక్కిన డీకే: డిప్యూటీ సీఎం నేరుగా వెళ్లి.. సిద్ధరామయ్య కాళ్లు మొక్కారు. ముఖ్యమంత్రి ఆశీర్వాదాన్ని డీకే శివకుమార్‌ తీసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. అయితే సిద్ధూ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో కన్నడ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. తదుపరి సీఎం ఎవరనేది ఆసక్తిగా మారింది. మరోవైపు తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో డీకే కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Also read-Karnataka:: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా: సిద్ధరామయ్య

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News