HomeTop StoriesKarnataka: నేడు కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Karnataka: నేడు కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో సాయంత్రం 4:05 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

- Advertisement -

తరలిరానున్న ప్రముఖులు: ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్య హాజరుకానున్నారు. వీరితో పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వివిధ సర్వధర్మ మఠాధిపతులు, వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులు, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేయనున్నారు.

పది మందికి మంత్రివర్గంలో ఛాన్స్?: ముఖ్యమంత్రితో పాటు కనీసం పదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ మంత్రుల జాబితాపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గత రెండు రోజులుగా దిల్లీలోనే విడిది చేసిన డీకే శివకుమార్, సిద్ధరామయ్యలతో పాటు మంత్రి పదవులను ఆశిస్తున్న దాదాపు 30 మందికి పైగా నేతలు ఏఐసీసీ అగ్రనేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమీకరణాల నేపథ్యంలో తొలి విడతలో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చి.. ఆ తర్వాత విడతలో జూనియర్లకు అవకాశం కల్పించాలని ఏఐసీసీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార సమయానికి ముందు మంత్రుల తుది జాబితా వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News