HomeTop StoriesKarnataka: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌.. జూన్‌ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం!

Karnataka: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌.. జూన్‌ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం!

DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా డీకే శివకుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

డీకే పేరును ప్రతిపాదించిన సిద్ధు: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ పేరును మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించారు. అనంతరం పార్టీ సీనియర్‌ నేత పరమేశ్వర దాన్ని బలపరిచినట్లు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం ఎమ్మెల్యేలంతా డీకే నాయకత్వానికి జై కొట్టారు.

ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం: శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వెంటనే డీకే శివకుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ థావర్ చంద్ గహ్లోత్‌ను కలిశారు. సీఎల్పీ తీర్మాన ప్రతిని అందించారు. ప్రభుత్వం ఏర్పాటుకు తగిన అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన గవర్నర్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా డీకే శివకుమార్‌ను అధికారికంగా ఆహ్వానించారు.

Also Read-Telangana: కేసీఆర్‌పై ఒట్టేసి హరీశ్‌రావు నిజం చెప్పాలి.. సీఎం రేవంత్ డిమాండ్!

జూన్‌ 3న ప్రమాణ స్వీకారోత్సవం: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ జూన్‌ 3న ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్‌ హౌస్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ వేడుక జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం పార్టీ శ్రేణులు ఇప్పటికే లోక్‌భవన్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News