Dussehra Holidays For Intermediate Students: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు దసరా సెలవులు ప్రకటించింది. రేపటి (సెప్టెంబర్ 27) నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు అమల్లో ఉంటాయని తెలిపింది. మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని ఆయా కళాశాల యాజమాన్యాలను ఆదేశించింది. సెలవుల అనంతరం తిరిగి అక్టోబర్ 6న ఇంటర్ కాలేజీలు తెరుచుకొనున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది. కాగా, తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు 2025 సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ఒక రోజు ముందుగానే అంటే రేపటి (సెప్టెంబర్ 27) నుంచి తెలంగాణలో జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే, సెలవుల్లో ప్రైవేటు కాలేజీలు క్లాసులు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్, యాజనమ్యం సెలవుల్లో క్లాసులు నిర్వహించే అఫిలియేషన్ క్యాన్సిల్ చేయవల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు స్కూళ్లతోపాటు జూనియర్ కాలేజీలకు కూడా 10 రోజులు సెలవులు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/mla-komatireddy-shocking-comments/
ఒకరోజు ముందుగానే ఇంటర్ విద్యార్థులకు సెలవులు..
కాగా, తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఇప్పటికే దసరా సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పాఠశాలల విద్యార్ధులు సొంతూళ్లకు చేరుకున్నారు. మొత్తం 13 రోజులు సెలవులు రావడంతో పిల్లల ఆనందానికి అవదులు లేకుండా ఉంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ తిరిగి పాఠశాలలు అక్టోబర్ 3వ తేదీన తెరచుకోనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు కూడా దసరా సెలవులు వచ్చాయి. అటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. పాఠశాలలు తిరిగి అక్టోబరు 3న పునఃప్రారంభం కానున్నాయి. ఎన్సీఈఆర్టీ ప్రకటించిన 2025-26 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు ఈనెల 24 నుంచి అక్టోబరు 2 వరకు సెలవులు ప్రకటించారు. దీంతో ఏపీ విద్యార్థులకు 11 రోజుల పాటు దసరా సెలవులు అమల్లో ఉండనున్నాయి.


